అంతర్జాతీయ మానవ కర్తవ్య దినోత్సవం
నిజామాబాద్ ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 13
జె సి ఐ వారోత్సవాల్లో భాగం గా 4 వ రోజు
విఎన్‌ఆర్ పబ్లిక్ స్కూల్‌లో అంతర్జాతీయ మానవ కర్తవ్య దినోత్సవం పురస్కరించుకొని పోస్టర్ ఆవిష్కరణ అంతర్జాతీయ మానవ కర్తవ్య దినోత్సవం సందర్భంగా విఎన్‌ఆర్ పబ్లిక్ స్కూల్ లో ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం సమాజంపై మానవ కర్తవ్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ అర్థవంతంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి పూర్వ అధ్యక్షులు చంద్రశేఖర్ , యాదేష్ ప్రధాన అతిథులుగా హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మానవ హక్కులతో పాటు మానవ కర్తవ్యాలను గుర్తించి ఆచరించడం వ్యక్తి, సమాజం, దేశ ప్రగతికి అత్యంత అవసరమని తెలిపారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు అతిథులు ఈ కార్యక్రమాన్ని అభినందించి, కర్తవ్యనిబద్ధత, శ్రద్ధ, బాధ్యతా భావంతో జీవించాలని తెలియచేశారు.