*అంతర్జాతీయ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ* *శుభాకాంక్షలు*. అంతర్జాతీయ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా ప్రముఖ సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో పత్రికలు నాలుగో స్తంభంలా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు ప్రభుత్వల దృష్టికి తీసుకెళ్లి సమాజానికి తెలియపరుస్తూ సమస్య పరిష్కారానికి బాధ్యతాయుతంగా గుర్తుచేసేదే పత్రికలు సమాజంలోని ఆర్థిక రాజకీయ సామాజిక సర్వజనీన కోణాలలో సమీకృతం చేసి సమాజానికి ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చేదే పత్రికలు,అలాంటి పత్రికలు అందరికీ సమాజ శ్రేయస్సు కోరీ అంకితభావంతో పనిచేస్తున్నయి. పాత్రికేయులందరికీ అంతర్జాతీయ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ సామాజికవేత ఎం. శ్రీనివాస్ కుమార్. బాధ్యతగా స్వేచ్ఛ వాతావరణం లో పాత్రికేయులు పత్రికలు ఉండాలి. అలాంటి పత్రిక ,పాత్రికేయుల స్వేచ్ఛను హరించటం అంటే హక్కులను కాలరాసినట్టే ఆ హక్కులకు భంగం కలిగితే తద్వారా సమాజాన్ని చీకటి అంధకారంలోకి నెట్టినట్టే అవుతుంది. అందుకుగాను ప్రతి ఒక్కపత్రిక ,పాత్రికేయుడు తన భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా అంతర్జాతీయ పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటూ తన హక్కులను తెలుసుకొని గుర్తించుకొని బాధ్యతాయుతంగా ఉండాలని అంతర్జాతీయ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా సామాజికవేత యం శ్రీనివాస్ కుమార్ కోరారు.
అంతర్జాతీయ పత్రిక స్వేచ్ఛ దినోత్సవశుభాకాంక్షలు..ఎం శ్రీనివాస్
Published On: May 3, 2025 7:11 pm