Site icon PRASHNA AYUDHAM

అమెరికాలో తెలంగాణ కానిస్టేబుల్ కి అంతర్జాతీయ మెడల్

IMG 20250703 WA0391

అమెరికాలో తెలంగాణ కానిస్టేబుల్ కి అంతర్జాతీయ మెడల్

 

– కామారెడ్డి పోలీస్ శాఖకు గర్వకారణం

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 3

 

కామారెడ్డి జిల్లాకు చెందిన కానిస్టేబుల్‌ మొహమ్మద్ బాబా, ప్రస్తుతం ఐ జి పి స్పోర్ట్స్, హైదరాబాద్‌లో అటాచ్‌డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తేది: 27.06.2025 నుంచి 06.07.2025 వరకు అమెరికా, బర్మింగ్‌హామ్ నగరంలో నిర్వహిస్తున్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ – 2025లో పాల్గొన్నారు. షాట్‌పుట్ – ట్రాక్ అండ్ ఫీల్డ్ (35+ వయో వర్గం) లో మన రాష్ట్రం నుండి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన, బ్రాంజ్ మెడల్ సాధించి దేశానికి, రాష్ట్రానికి, మన జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ ఇది కామారెడ్డి జిల్లా పోలీస్‌కు గర్వకారణం అని, ప్రతిభావంతులకు పోలీస్ శాఖ తరపున మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది జిల్లా పోలీస్ శాఖ తరఫున కానిస్టేబుల్ మొహమ్మద్ బాబా కు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

Exit mobile version