కామారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకలు
– కామారెడ్డి
జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా, కామారెడ్డి, గాంధారి, లింగంపేట, జుక్కల్, పుల్కల్, అర్గొండ, నిజాంసాగర్, నాగిరెడ్డిపేట, బీబీపేట్, మద్నూర్, ఎల్లారెడ్డి, భిక్నూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో విభిన్న యోగా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయనీ జిల్లా ఆయుష్ ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాల్లో భాగంగా పురుషులు, మహిళల విభాగాల్లో యోగా పోటీలు నిర్వహించబడ్డాయన్నారు. ప్రతి కేంద్రంలో యోగా శిక్షకుల పర్యవేక్షణలో పాల్గొనే ఆసక్తి ఉన్న అందరూ పోటీల్లో పాల్గొన్నారు. పోటీలలో పురుషులు , మహిళల కేటగిరీల్లో మొదటి , ద్వితీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు.