పాకిస్తాన్ తమతో నమ్మక ద్రోహానికి పాల్పడటం వల్లే ఆ దేశానికి చెందిన చమురు నౌకపై బాంబు దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికాతో కలిసి కుమ్మక్కై, తమ దేశ నౌక ద్వారా అమెరికాకు చమురును సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది.
ఈ కారణంగానే బాంబులతో దాడి చేసి, నౌకను దగ్ధం చేసినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ అమెరికా చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తోందని ఇరాన్ తీవ్రంగా విమర్శించింది.
చర్చల పేరుతో పాకిస్తాన్ను, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమకు ఎరగా వేసుకున్నారని పేర్కొంది. పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి తమ వద్ద చెల్లదని ఇరాన్ స్పష్టం చేసింది.
తమ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలను సహించేది లేదని హెచ్చరించింది. ఈ సంఘటన అంతర్జాతీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.
ఇరాన్, పాకిస్తాన్ మధ్య సంబంధాలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.







