గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సేవలకు అంతరాయం
Aug 08, 2025,
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సేవలకు అంతరాయం
భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో గురువారం అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యతో నగదు లావాదేవీలు నిలిచిపోవడంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. ఫలితంగా హెచ్డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాంటి ప్రముఖ బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. ప్రతి రోజూ కోట్లాదిమంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సేవలను వినియోగించుకుంటారు. ఒక్కసారిగా సేవలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.