*ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతిథి అధ్యాపకుల నియామకానికి ఇంటర్వ్యూ*
*ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రమేష్*
*జమ్మికుంట జులై 22వ ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపకుల నియామకానికి ఈ నెల 24 న కళాశాలలో ఇంటర్యూలు నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో కంప్యూటర్ సైన్స్ (computer science)-1, డైరీ సైన్స్ (Dairy science) – 1. క్రాప్ ప్రొడక్షన్ (crop production) -1, బాటనీ(Botany)- 1 ఖాళీలుగా ఉన్నాయని ఆసక్తి గల వారు నెట్, స్లెట్, పిహెచ్ డీ లు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడ తుందన్నారు. సంబందిత దృవీకరణ పత్రాలతో ఈనెల 24 (గురువారం) సమయం ఉదయం 11.00 గంటలకు కళాశాలలో ఇంటర్వ్యులు నిర్వహించబడుతుందన్నారు. అర్హూలైన అభ్యర్థులు సంబందిత దృవీకరణ పత్రాలతో నేరుగా కళాశాలలో జరిగే ఇంటార్వ్యూలకు హాజరు కాగలరని ప్రిన్సిపాల్ కోరారు