ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను ప్రవేశపెట్టాలి

*ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను ప్రవేశపెట్టాలి*

-విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్

ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :

విద్యార్థి సేన ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాల కిష్ట రెడ్డికి సోమవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ కోర్సులు అందుబాటులో లేకపోవడం వలన విద్యార్థులు ఇతర నగరాలకు, దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని దీనితో ఆర్థిక భారం పెరిగిపోతుందని అన్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను గుర్తిస్తూ, ఈ కోర్సులు విద్యార్థులకు సమర్థవంతమైన ప్రొఫెషనల్ నైపుణ్యాలు అందిస్తాయని, ఇవి వారికి ఉత్తమ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమవుతుందన్నారు. విద్యార్ధుల సమస్యను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను ప్రవేశపెట్టాలని కోరారు . ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు పవన్, సురేష్, ప్రసాద్, రిషబ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment