ఆయుకట్టు రైతులను బెదిరిస్తున్న ఆక్రమణదారులు..

మెట్టూరులో అడ్డిగాడి చెరువును అడ్డంగా ఆక్రమించుకున్న గ్రామస్థులు.

అడుగుతున్న ఆయుకట్టు రైతులను బెదిరిస్తున్న ఆక్రమణదారులు..

ఈ ఆక్రమణదారులకు అండగా కొందరు రాజకీయ నాయకులు..

వారం రోజుల్లో అక్రమంగా ఆక్రమించుకుని నిర్మాణం చేసిన ఇళ్లును, షాపింగ్ కాంప్లెక్స్ లను, బడ్డీ కొట్టులను కూల్చివేయాలని నోటీసులు ఇచ్చిన రెవెన్యూ అధికారులు.

IMG 20240928 WA0107

 

పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలో 321-1 సర్వే నెంబర్ లో గల 1.66 సెంట్ల విస్తీర్ణం గల అడ్డిగాడి చెరువులో కొందరు గ్రామస్థులు ఎంతో విలువైన దాదాపు 30 సెంట్లు స్థలాన్ని ఆక్రమణలు చేసి ఇళ్ల నిర్మాణాలు, షాపింగ్ కాంప్లెక్స్, బడ్డీ కొట్టులు పెట్టుకున్నారు. వీరు చెరువు గర్భంలో ప్రవేశించటమే కాకుండా వీరు ఉపయోగిస్తున్న వ్యర్థ పదార్ధాలను కూడా చెరువు లోకి వేయటం వలన చెరువులో నీరు కలుషితం అయ్యింది. చెరువు కింద ఉన్న ఆయుకట్టు రైతులు ఈ అక్రమణల గురించి అడుగుతుంటే వారిని బెదిరిస్తున్నారు. అడ్డిగాడి చెరువు కింద ఉన్న ఆయుకట్టు రైతుల్లో అరుబోలు ధర్మారావు అనే రైతు 2022-23లో ఈ ఆక్రమణల గురించి లోకాయుక్త కోర్ట్ ని కూడా ఆశ్రయించారు. లోకాయుక్త నుంచి ఆక్రమణలను తొలగించమని ఆదేశాలు రావటంతో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ పాపారావు అడ్డిగాడి చెరువుగర్భ ఆక్రమణదారుల నిర్మాణాలను వారం రోజుల్లో కూల్చి వేయాలని ఈ రోజు నోటీసులు ఇచ్చారు. ఈ ఆక్రమణలలో దాదాపు 23 ఇళ్ల నిర్మాణాలు, 8 బడ్డీ కొట్టులు ఉన్నట్లు వారికి నోటీసులు ఇచ్చినట్లు కొత్తూరు మండల తహసీల్దార్ పాపారావు తెలిపారు. ఆయుకట్టు రైతులు అడ్డి గాడి చెరువు ఆక్రమణలు తొలగించడమే కాకుండా ఈ చెరువును జాతీయ ఉపాధి హామీ పధకం కింద బాగుచేయించి ఈ చెరువుకు మళ్ళీ పూర్వరూపం తీసుకురావాలని రాజకీయ నాయకులను, అధికారులను వేడుకుంటున్నారు. ఐతే చివరిగా ఈ రెవెన్యూ అధికారుల ఆదేశాలు పేపర్ కే పరిమితం అవుతుందా? లేదా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తారా? ఈ సమస్య మద్యలో కోర్ట్ నుంచి ఏమైనా ఆదేశాలు తెచ్చి కూల్చివేతలను ఆపడం జరుగుతుందా? అనేది ఇంకో 5 రోజులు వేచిచూడాల్సిందే…

Join WhatsApp

Join Now