డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ క్యాలండర్, డైరీ ఆవిష్కరణ

డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ క్యాలండర్, డైరీ ఆవిష్కరణ

*గజ్వేల్ నియోజకవర్గం ప్రతినిధి, డిసెంబర్ 3, (ప్రశ్న ఆయుధం ):*

2025 డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ క్యాలెండర్, డైరీలను జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని జిల్లా విద్యాధికారి కార్యాలయములో శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఉపాధ్యాయ సమస్యల పట్ల అనునిత్యం పోరాటం చేసేటువంటి సంఘంగా అభివర్ణించాడు. ఉపాధ్యాయ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. అదే విధంగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యతగా నిర్వర్తిస్తుందని అన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అబ్దుల్ రహమాన్, ఏడి వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్వోలు రామస్వామి, రంగనాథ్, సూపర్డెంట్ వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి, ఉపాధ్యక్షులు చంద్రభాను, కిష్టయ్య, జిల్లా సైన్స్ అధికారి కల్లేపల్లి శ్రీనివాస్, కార్యదర్శులు మల్లయ్య, రాజయ్య, మనీష్ కుమార్, సత్యనారాయణ, దివాకర్, బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now