ఇండియన్ లీగల్ క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి 10

దమ్మపేట మండల కేంద్రంలో మల్లారం కోర్టు నందు
ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ ఎల్ పి ఏ) క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దమ్మపేట ప్రధాన శ్రేణి న్యాయమూర్తి గౌరవ సాయి ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాన్ని దమ్మపేట బార్ అధ్యక్షులు శ్రీ మారం సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ ఎల్ పి ఏ) యొక్క ప్రధాన లక్ష్యాలు న్యాయవృత్తి రంగంలోని ప్రామాణికతను మెరుగుపరచడం, న్యాయవాదుల హక్కులను రక్షించడం, వారి సమస్యలకు పరిష్కారాలను అందించడం, మరియు సామాజిక న్యాయానికి ఊతమిచ్చే విధంగా పని చేయడం.
ఐ ఎల్ పి ఏ న్యాయవాదుల మద్దతు కోసం ఒక శక్తివంతమైన వేదికగా ఉండి, వృత్తిపరమైన విలువలను కాపాడడం, న్యాయ ప్రక్రియలో సామాన్య ప్రజలకు సులభతరం చేయడంలో సహాయపడటం వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది అని అన్నారు ఈ ఆవిష్కరణ కార్యక్రమం న్యాయవృత్తి ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, న్యాయవాదుల ఐకమత్యాన్ని, సామాజిక బాధ్యతను ప్రోత్సహించేలా నిలిచింది అన్నారు.
కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఉడతనేని శ్రీనివాసరావు , పి. పి శ్రీనివాస్ , సోమిశెట్టి శ్రీధర్ ,కృష్ణ ప్రసాద్ ,లక్కినేని నరేంద్రబాబు , గొంది మురళి, టి బాలరాజు , గొంది సంధ్యారాణి , తీర్నాటి సంజయ్ ,తనగాల అరుణ కుమారి , గద్దల అప్పారావు , నల్లపు ఉదయ్ , భవాని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment