*రీయంబర్స్ మెంట్ కోసం విద్యార్థుల సమరశంఖారావం గోడప్రతుల ఆవిష్కరణ*
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
నీల నాగరాజ్
బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు.
జిల్లా కేంద్రంలో బీసీ బాలుర వసథిగృహంలో జరిగిన సమావేశంలో జనవరి 8న ఇందిరా పార్క్ వద్ద జరిగే బీసీ విద్యార్థుల సమర శంఖారావం గోడప్రతులు ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సుమారుగా 4,500 కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ విద్యార్థుల కు ఏ విధంగా అయితే స్కాలర్షిప్లు విడుదల చేస్తున్నారో బీసీ విద్యార్థులకు కూడా ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.బీసీ గురుకులకు, సంక్షేమ వసతి గృహాలలో సొంత భవనాలు నిర్మించాలి మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలి.ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్లను అమలు చేయాలి.పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు సంఖ్యను పెంచాలి.హైదరాబాదులో 10 ఎకరాలలో పూలే నాలెడ్జ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి.ఫీజులు,స్కాలరుషిప్లు,మెస్ చార్జీల నిధులు ప్రతీ 3 నెలలకు ఒకసారి గ్రీన్ చానల్ ద్వార విడుదల చేయాలి.ప్రయివేట్ యూనివర్సిటీ లలో కూడా సామాజిక రిజర్వేషన్లు అమలు చేయాలి.ఇంటర్,డిగ్రీపీజీ,ఇతర వృత్తి విద్యా కోర్సుల కామన్ ఫీజును పెంచాలి అని అన్నారు.బడుగు,బలహీన వర్గాలు విద్యార్థుల ఫీజుల సమస్యలు,సంక్షేమ వసతి గృహాల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చి బీసీ విద్యార్థుల సమర శంఖారావాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అనంతుల సాయి గౌడ్,బీసీ విద్యార్థి సంఘం నాయకులు శ్రీనివాస్, హరి, వెంకటేష్, ప్రసాద్, రమేష్, అనిల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.