వరి పంటకు మద్దతు ధర పోస్టర్ ఆవిష్కరణ

వరి పంటకు మద్దతు ధర పోస్టర్ ఆవిష్కరణ

పౌరసరఫరాల సంస్థ రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా

 కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి( ప్రశ్న ఆయుధం)అక్టోబర్ 17

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం క్యాంప్ కార్యాలయంలో వరి పంటకు మద్దతు ధర పోస్టర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల సంస్థ రూపొందించిన ఈ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్, రైతులకు కనీస మద్దతు ధర వివరాలు స్పష్టంగా తెలియజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

జిల్లాలోని ప్రతి పర్చేసింగ్ (PPC) సెంటర్ వద్ద ఈ పోస్టర్లు స్పష్టంగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు మద్దతు ధరల గురించి అవగాహన కలిగి ఉండేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి. విక్టర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, డి.సి.ఎస్.ఓ వెంకటేశ్వర్లు, డి.ఆర్.డి.ఏ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment