*అట్రాసిటీ కేసుల పై విచారణ చేసిన ఏసీపీ శ్రీనివాస్ జి*
*జమ్మికుంట నవంబర్ 16 ప్రశ్న ఆయుధం*
జమ్మికుంట పట్టణం, మండలంలోని నగురం గ్రామoలో కులం పేరుతో దూషించినట్లు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా హుజరాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి శనివారం విచారణ చేపట్టారు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి వాడలో నివాసం ఉంటున్న ఈర్ల రజిత ను తన ఇంటి పక్కన నివాసముంటున్న మడిపల్లి అనిల్ అనే వ్యక్తి కులం పేరుతో దూషించినట్లు ఫిర్యాదు చేయగా శనివారం ఏసిపి శ్రీనివాస్ జి విచారణ చేపట్టారు. అలాగే మండలంలోని నగురం గ్రామంలో కవ్వంపల్లి లలిత అనే మహిళ తనను కులం పేరుతో దూషించిందని అదే గ్రామానికి చెందిన పాశికంటి రాణి తిరుపతి లపై ఫిర్యాదు చేయగా శనివారం ఏసీపీ శ్రీనివాస్ జి గ్రామంలో విచారణ చేపట్టారు. ఆయన వెంట జమ్మికుంట ఎస్సై ఆరోగ్యం పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.