Site icon PRASHNA AYUDHAM

లిటిల్ స్కాలర్స్ హై స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెరెమనీ 

IMG 20250719 WA0334

లిటిల్ స్కాలర్స్ హై స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెరెమనీ

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 19

 

కామారెడ్డి లిటిల్ స్కాలర్స్ హై స్కూల్‌లో విద్యార్థి నాయకత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో విద్యార్థి కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఇందులో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, అలాగే టోపాజ్, ఎమరాల్డ్, రూబీ, సఫైర్ అనే నాలుగు హౌజుల కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు ని విద్యార్థుల ఓట్ల ద్వారా ఎంపిక చేశారు. ఎన్నికల అనంతరం, శనివారం ఉదయం కొత్తగా ఎంపికైన ప్రతినిధులు వేదికపై ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన మార్చ్ పాస్ట్, ప్రమాణ స్వీకార శపథం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకకు పాఠశాల ఛైర్మన్ పున్నా రాజేశ్ , డైరెక్టర్లు రాజేశ్వర్, అరుణ, ప్రిన్సిపాల్ స్వాతి ప్రియ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవికి కంటే బాధ్యతే గొప్పదనీ, మీరు మీ ప్రవర్తనతో ఇతరులకు ఆదర్శంగా నిలవాలి అని నూతన ప్రతినిధులకు సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాలు, సమిష్టి బాధ్యత భావన, సేవా దృక్పథాన్ని పెంపొందించడానికి ఉపయోగపడిందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

Exit mobile version