కెసిఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేత

కెసిఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేత

గజ్వేల్ నియోజకవర్గం, 27 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ లోని పురాతన దేవాలయం శ్రీ ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల ఆహ్వాన పత్రిక గురువారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో అందజేసిన అంగడికిష్టాపూర్ మాజీ సర్పంచ్ లక్ష్మీ రాములు గౌడ్, శ్రీ ఉమామహేశ్వర దేవాలయం చైర్మన్ బల్లి శ్రీనివాస్. ఈ సందర్భంగా బల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కెసిఆర్ మమ్మల్ని ఆప్యాయంగా పలకరించారని, శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని శుక్రవారం నిర్వహించే ఉమామహేశ్వర కళ్యాణం లో పాల్గొనవలసిందిగా కెసిఆర్ కు తెలియజేయడం జరిగిందని అన్నారు. వారితో పాటు ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు రాజారావు ఉన్నారు.

Join WhatsApp

Join Now