భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పీపీటీసీ కౌన్సిలర్ ఉద్యోగానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు భద్రాచలం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగం కాట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేస్తామని, ఇందుకోసం డిగ్రీ లేదా పీజీలో సోషియాలజీ, సైకాలజీ, సోషల్ వర్క్, ఆంత్రోపాలజీ, హ్యూమన్ డెవలప్మెంట్ పూర్తి చేసి నర్సింగ్లో మూడు ఏళ్ల పాటు అనుభవం ఉండాలని ఆయన తెలిపారు.