నిజామాబాద్‌లో 102 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్ సెప్టెంబర్ 26

(ప్రశ్న ఆయుధం)

ఎస్సీ, ఎస్టీ, గౌడ్ వర్గాలకు ప్రత్యేక కేటాయింపు

డిసెంబర్ 1నుంచి నూతన షాపుల ప్రారంభం

నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2025-27 మద్యం పాలసీని ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో, జిల్లాలో కొత్తగా మద్యం దుకాణాల (A4 షాపులు) ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 102 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

మండలాల వారీగా షాపుల విభజన:

నిజామాబాద్ – 36

ఆర్మూర్ – 25

బోధన్ – 18

భీంగల్ – 12

మోర్తాడ్ – 11

రిజర్వేషన్ కింద షాపులు:

ఎస్సీ అభ్యర్థులకు – 11 (జి.సీరియల్ నెంబర్లు: 2, 8, 10, 15, 27, 42, 49, 59, 67, 69, 84, 86)

ఎస్టీ అభ్యర్థులకు – 2 (జి.సీరియల్ నెంబర్లు: 65, 100)

గౌడ్ వర్గానికి – 11 (జి.సీరియల్ నెంబర్లు: 22, 26, 53, 60, 71, 78, 80, 82, 83, 92, 95, 101)

దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లు:

1. ₹1.30 లక్షల నాన్ రిఫండబుల్ డిమాండ్ డ్రాఫ్ట్/చలాన్

2. సెల్ఫ్ సెర్టిఫైడ్ ఆధార్/పాన్ కార్డ్ ప్రతులు

3. మూడు కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

4. రిజర్వుడ్ షాపులకు కుల ధ్రువీకరణ పత్రం (ప్రభుత్వం జారీ చేసినది)

ముఖ్య తేదీలు:

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: సెప్టెంబర్ 26

దరఖాస్తుల ముగింపు తేదీ: అక్టోబర్ 18

డ్రా తేదీ: అక్టోబర్ 23 (భారతీ గార్డెన్స్, హైదరాబాద్ రోడ్, రాంనగర్)

నూతన షాపుల ప్రారంభం: డిసెంబర్ 1

కొన్ని షాపుల ప్రదేశ మార్పులు:

నందిపేట్‌లో ఒక షాప్ తొలగించి కొత్తగా ఏర్పాటు

జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ వైన్స్‌ను తొలగించి మండల కేంద్రానికి మార్పు

నిజామాబాద్ ద్వారకానగర్ వైన్స్‌ను ముబారక్‌నగర్‌కు మార్చింపు

బాల్కొండ వైన్స్‌ను మోపాల్ మండల కేంద్రానికి తరలింపు

ఈ సమావేశంలో ఎక్సైజ్ సీఐ స్వప్న, గుండప్ప, మల్లేష్ భాస్కర్ రావు, ఇతర ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now