*లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులకు ఆహ్వానం*
*ఇదొక సువర్ణ అవకాశం*
*జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్*
తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) నుండి లైసెన్స్
సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్* శనివారం ఒక ప్రకటన లో తెలిపారు.
ఆసక్తి గల అర్హులైన అభ్యర్ధులు.. తెలంగాణలోని అన్ని *మీ సేవ కేంద్రాలలో* లైసెన్స్ సర్వే శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేయవచ్చని…ఎంపికైన అభ్యర్థులకు *జిల్లా ప్రధాన కేంద్రాలలో* మొత్తం 50 పని దినాలు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
*అభ్యర్థుల అర్హతలు*
ఇంటర్మీడియట్ (గణిత శాస్త్రం ఒక అంశంగా ఉండాలి) కనీసం 60% మార్కులతో
ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్)
డిప్లొమా (సివిల్)
బి.టెక్ (సివిల్)
లేదా ఇతర సమానమైన అర్హత
*దరఖాస్తు విధానం*
దరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టస్ను 2025 మే 5 నుండి మే 17 వరకు *మీ సేవా కేంద్రాల* ద్వారా మాత్రమే రూ. 100/- చెల్లించి పొందవచ్చు.
*దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 17.05.2025 (మీ సేవ కేంద్రాల్లో మాత్రమే)*
*ఫీజు వివరాలు*
OC అభ్యర్ధులకు రూ 10,000/-
BC అభ్యర్ధులకు రూ 5,000/-
SC/ ST అభ్యర్థులకు రూ 2,500/-
లైసెన్స్ కలిగిన సర్వేయర్లుగా మారేందుకు ఇదొక సువర్ణ అవకాశమని… అర్హత కలిగినటువంటి అభ్యర్థులు, తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మానేజ్మెంట్ నుండి విడుదల అయినటువంటి ఈ నోటిఫికేషన్ ని సద్వినియోగ పరుచుకోవాలని అట్టి ప్రకటన లో *కలెక్టర్* పేర్కొన్నారు.