రాజ్యంగ పరిరక్షణ సదస్సుకు రావాలని చింతల నాగరాజు కు ఆహ్వానం

*రాజ్యంగ పరిరక్షణ సదస్సుకు రావాలని చింతల నాగరాజు కు ఆహ్వానం*

*ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 16: కుత్బుల్లాపూర్ ప్రతినిధి*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆదివారం బిసి ఐక్యవేదిక అధ్యక్షులు గూడ ఐలయ్య గౌడ్, దళిత సంక్షేమ సంఘ జాతీయఅధ్యక్షుడు బూదాల అమర్ బాబు, దళిత సేన జాతీయ అధ్యక్షులు అవిజే జేమ్స్, బహుజన సేన అధ్యక్షులు ఆంజనేయులు, కార్మిక నాయకులు చింతల నాగరాజు నివాసంలో కలిశారు.

వచ్చేనెల మార్చి ఒకటిన రాజ్యాంగ పరిరక్షణ కొరకు సదస్సు నిర్వహిస్తున్నామని ఆ సదస్సుకు ముఖ్య అతిథులుగా రావాలని చింతల నాగరాజు కు ఆహ్వాన పత్రిక అందించారు.

నాగరాజు సానుకూలంగా స్పందించి సదస్సుకు తప్పకుండ హాజరైతానని తెలియజేసారు.

ఈ సందర్భంగా కార్మిక నాయకులు చింతల నాగరాజు మాట్లాడుతూ…. మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము బడుగు బలహీన వర్గాల, దళితులు,మైనార్టీల కోసము పనిచేసే ప్రభుత్వమని తెలియజేశారు.

మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి మొట్టమొదటిగా మన పాఠ్య పుస్తకాలలో రాజ్యాంగం గురించి తెలియజెప్పింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.

ఈ రాజ్యాంగ పరిరక్షణ సదస్సు అందరూ హాజరై విజయవంతం చేద్దామని హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now