పాడేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 24
పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వనము చిట్టబ్బాయి తెలియజేశారు. కళాశాలలో ఈ క్రింది పోస్టులకు కామర్స్-1 కంప్యూటర్ సైన్స్-1 కంప్యూటర్ అప్లికేషన్-1 హార్టికల్చర్-1 హిస్టరీ -1 ఫిజికల్ డైరెక్టర్ -1 లైబ్రరీ సైన్స్-1 మ్యాథ్స్ -1 సంబంధించి అతిథి అధ్యాపకులను నియమిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 27
సాయంత్రం ఐదు గంటల లోపు కళాశాల ఆఫీసులో దరఖాస్తులను అందజేయాలన్నారు.