మెదక్/నర్సాపూర్, మార్చి 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో నిర్వహిస్తున్న”శ్రీ దుర్గాభవాని సహిత శ్రీ రేణుక ఎల్లమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి” బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ ను ఆహ్వానించారు. బుధవారం నర్సాపూర్ లో చిన్నచింతకుంట గ్రామ గౌడ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా వారికి తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు.
చిన్నచింతకుంటలో ఆలయ ఉత్సవాలకు రమేష్ గౌడ్ కు ఆహ్వానం
Published On: March 5, 2025 12:07 pm
