రేషన్ దుకాణం డీలర్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదు
*వ్రాత పరీక్ష, మౌఖిక పరీక్ష లో అర్హత సాధించిన వారికి మాత్రమే రేషన్ షాపు కేటాయింపు*
*అవినీతి రహిత కామారెడ్డి కోసం ప్రతి బీజేపీ కార్యకర్త ముందుకు రావాలి*
*వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి మున్సిపాలిటీ బీజేపీ కైవసం అవుతుంది*
*కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి*
ప్రశ్న ఆయుధం, ఆగష్టు 12, కామారెడ్డి :
కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ రేషన్ దుకాణం డీలర్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేదిలేదన్నారు. దరఖాస్తు చేసుకుని వ్రాత పరీక్ష, మౌఖిక పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే రేషన్ షాపు కేటాయింపు ఉంటుందని అన్నారు. వేరే నియోజకవర్గాలలో కేటాయింపు ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియదు కానీ కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 25 రేషన్ దుఖానాలకు గాను ఒక్క రేషన్ షాపు డీలర్ నియామకంలో కూడా అవకతవక జరగదని అన్నారు. అవినీతి రహిత కామారెడ్డి కోసం ప్రతి బీజేపీ కార్యకర్త ముందుకు రావాలనీ అన్నారు. అందుకోసం ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే సరిపోదని తనతో పాటు కౌన్సిలర్, సర్పంచ్ వంటి స్థానిక నాయకులు కూడా బీజేపీ వారు గెలిస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి మున్సిపాలిటీ బీజేపీ కైవసం అవుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు విపుల్ జైన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్, కౌన్సిలర్ నరేందర్, నాయకులు అనిత, వేణు, వెంకటచారి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.