చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా..?.ఆ పార్టీలో చేరతారా..?

*చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఆ పార్టీలో చేరతారా?*

వెండితెర మీద మెరిసినా..పొలిటికల్ మీటింగ్‌లో కనిపించినా.. ఆయనెక్కడున్నా సమ్‌థింగ్‌ స్పెషలే. పాలిటిక్స్‌కు ఆయన దూరంగా ఉన్నా..రాజకీయాలు మాత్రం ఆ టాలీవుడ్‌ బిగ్‌స్టార్‌ నుంచి దూరం కావడం లేదు.మరోసారి ప్రధానితో కనిపించి..పొలిటికల్‌ గాసిప్‌లో వైరల్‌ న్యూస్‌గా మారారు మెగాస్టార్‌. చిరు రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారా? మెగాస్టార్‌ను కాషాయం ఆకర్షిస్తుందా? చిరంజీవికి మోదీ అంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక రీజనేంటి?

*చిరు పొలిటికల్ రీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్..*

మెగాస్టార్ చిరంజీవి. తెలుగు స్టేట్స్‌లోనే కాదు..నేషనల్‌ వైడ్‌గా ఆయనకున్న క్రేజే వేరు. సినిమా పరంగానే..రాజకీయం రంగంలోనూ చిరుకు ఫాలోయింగ్ బానే ఉంది. అందుకే ప్రధాన పార్టీలు ఆయన పేరు ప్రస్తావించకుండా ఉండలేవు. అయితే చిరంజీవి పొలిటికల్‌ గా యాక్టివ్‌ కాబోతున్నారన్న న్యూస్‌ ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. కమలం చిరును ఆకర్షిస్తుందన్న టాక్‌ ఆసక్తిరేపుతోంది. అటు చిరు అభిమానుల్లోనూ..పవన్‌ ఫ్యాన్స్ లోనూ చిరు పొలిటికల్ రీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్ జరుగుతోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరు..అప్పటి ఎన్నికల్లో 18 సీట్లు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత..అటు కేంద్రంలో, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పొలిటికల్‌గా సైలెంట్‌ అయిపోయారు. 

*చిరుకి ప్రధాని మోదీ ఇచ్చిన ఇంపార్టెన్స్‌పై ఆసక్తికర చర్చ..*

ఆ తర్వాత ఆయన సినిమాల్లో బిజీ అయిపోయినా.. రాజకీయాలు మాత్రం చిరును వదిలిపెట్టడం లేదు. తరుచూ ఏదో ఒక ఘటన మెగాస్టార్‌ను రాజకీయాల్లోనూ లాగుతోంది. లేటెస్ట్‌గా ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ..చిరంజీవికి ఇచ్చిన ఇంపార్టెన్స్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని.. మళ్లీ పొలిటికల్‌ స్క్రీన్‌ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందట. చిరు సేవలను బీజేపీ వాడుకోవాలని చూస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అందుకు చాలా సందర్భాలను గుర్తు చేస్తున్నారు. గతేడాది జూన్‌ కూటమి సర్కార్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని..చిరుతో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాదు పవన్‌, చిరు చేతులు పైకెత్తి వారితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని. అప్పట్లో ఆ సీన్‌ హైలెట్‌గా నిలిచింది. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. 

మరోసారి ప్రధాని మోదీ, చిరంజీవిల కలయిక మళ్లీ అలాంటి చర్చకే దారితీస్తోంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో సంబరాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి కూడా అటెండ్‌ అయ్యారు. అయితే అందరిలో ఒకడిలా కాకుండా..చిరుకు ప్రత్యేక గౌరవం దక్కడంపైనే ఇంట్రెస్టింగ్‌ చర్చ జరుగుతోంది.

*చిరుకి ప్రధాని మోదీ ఆత్మీయ పలకరింపు..*

చిరంజీవిని చూడగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్యాయంగా పలకరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తర్వాత కార్యక్రమానికి సంబంధించిన జ్యోతి వెలిగించే విషయంలోనూ చిరుకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధాని మోదీ తొలుత ఒక ఒత్తి వెలిగించగా.. చిరంజీవి రెండో ఒత్తిని వెలిగించారు.అంతేకాదు చిరంజీవితో పాటు నడుచుకుంటూ..తమకు ఏర్పాటు చేసిన సీట్లలో కూర్చున్నారు. పక్కపక్క సీట్లలోనే కూర్చుని కార్యక్రమాలను తిలకించారు. ఈ క్రమంలోనే చిరంజీవిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి సంబరాలకు అహ్వానించడం, ప్రధాని మోదీ ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం వెనుక బీజేపీ ఆంతర్యం వేరే ఉందన్న చర్చ మొదలైంది. 

*తెలుగు రాష్ట్రాల్లో మైలేజీ పెంచుకోవాలనే ప్లాన్..*

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఏపీ పాలిటిక్స్‌లో కీరోల్‌ ప్లే చేస్తున్నారు. ఆయన బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. సేనానితో మహారాష్ట్రలో ప్రచారం చేయించి మంచి ఫలితాలు సాధించింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే చిరంజీవిని రాజ్యసభకు పంపడం ద్వారా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో మరింత మైలేజీని అందుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు టాక్‌. అందులో భాగంగానే చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైతే చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ఆయనకు ఏఐసీసీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్‌లో చిరుకు బీజేపీ ఇస్తున్న ఇంపార్టెన్స్‌ చర్చనీయాంశం అవుతోంది. చిరంజీవి కాషాయం కండువా కప్పుకుని ఆ పార్టీకి ఫుల్‌ టైమ్‌ పనిచేస్తారా లేక..రాజ్యసభకు నామినేట్ అయి కేవలం బీజేపీ సపోర్టర్‌గానే ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ చిరు బీజేపీలో చేరితే ఇప్పటికే పవన్‌ జనసేన పార్టీ పరిస్థితి ఏంటన్నది కూడా మరో చర్చ. అయితే బీజేపీ, జనసేన వేరు అన్నట్లుగా లేకపోవడం చిరు ప్లస్‌ పాయింట్‌ అంటున్నారు.బీజేపీ కంటే ఎక్కువ హిందుత్వ ఎజెండాతో పవన్‌ ముందుకెళ్తుండటంతో బీజేపీ, జనసేన మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని స్పష్టం అవుతోంది. పవన్‌ కూడా మోదీ, అమిత్‌షాతో సన్నిహితంగా ఉంటున్నారు. సేనానికి బీజేపీ అధినాయకత్వం మంచి ప్రయారిటీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో చిరు బీజేపీ గూటికి చేరుతారా? రాజ్యసభకు నామినేట్‌ అవుతారా..? ఇద్దరు బ్రదర్స్‌ ఏపీ పాలిటిక్స్‌లో ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారా అన్నది ఆసక్తి రేపుతోంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో.. చిరు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.

Join WhatsApp

Join Now