ఆంక్షలు లేని రుణమాఫీ ఇవ్వాలి
ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలననా..
రాష్ట్ర ప్రజలను నిండా ముంచుతోంది కాంగ్రెస్…
రైతు భక్ష పార్టీ కాంగ్రెస్
భూ అక్రమార్కుల భాగోతం బయటపెట్టాలి..
ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు లేని రుణమాఫీ రైతులకు వెంటనే అందజేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూరనారాయణ డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్య స్థాపన అంటు తెలంగాణ ప్రజలను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ బిజెపి విలీన మంటూ ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టి స్తుందని మండిపడ్డారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు పదేపదే ఇందిరమ్మ రాజ్యమని మాట్లా డుతున్నారు.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన వచ్చేలా ఉందని విమర్శించారు.ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 420 హామీలతో యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నా రు. రైతు రాజ్యం అంటూనే రైతులను నిండా ముంచిందన్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ బాబా ఇచ్చిన హామీలకు విలువే లేదు ఇప్పటికి అమ లుకు నోచుకోలేదన్నారు. గత బిఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం రైతు ఆత్మ హత్యలలో 3వ స్థానంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేయడంలో మొదటి స్థానంలో ఉందని విమర్శిం చారు. వందరోజుల్లో అమలుచేస్తానని రైతు భరోసా గ్యారంటీ కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15000,రైతు కూలీలకు 12000,పంట బోనస్ 500 విటన్నిటికీ కాంగ్రెస్ పెద్ద గాడిద గుడ్డు పెట్టింది ఇదేనా కాంగ్రెస్ రైతు రాజ్యమని ప్రశ్నించారు. రుణమాఫీ ఒక మాయా జాలం డిసెంబర్ 9 సోనియామ్మ జన్మ దినానికి ఏక కాలంలోరూ 2 లక్షల రుణమాఫీ అని చెప్పి రూ.31 వేల కోట్లతో 32.50 లక్షల మందికి రుణమాఫీ చేస్తా నాన్న కాంగ్రెస్ మూడు దఫాలుగా రాష్ట్రా వ్యాప్తంగా 22,37,848 మంది రైతులకు 17,933 కోట్లు మాత్రమే..అర్హులైన రైతులు బ్యాంకుల ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆర్మూర్ బహి రంగ సభలో రేవంత్ సిద్దుల గుట్ట సాక్షిగా ఎటువంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తానని ఇందూర్ రైతన్నలను మోసం చేసిందన్నారు.రూ. 2.25 లక్షల రైతులు ఉన్న ఇందూర్ జిల్లాలో లబ్ది పొందింది 78,748 మాత్రమేనని చెప్పారు. రైతులకు వ్యవసాయానికి నిరంతర 24 గంటల కరెంటు అని కోతలు పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇదేనా కాంగ్రెస్ పార్టీ రైతు రాజ్యం అని ప్రశ్నిస్తున్న.కాంగ్రెస్ అంటేనే రైతు బక్ష పార్టీ అని ఎద్దేవా చేశారు. బిజెపి అంటేనె రైతు పక్షపార్టీ బిజెపి కేంద్రంలో వచ్చాక ఈ దేశానికి వెన్నుముక అయినా రైతును రాజు చేయడానికి అనేక సంక్షేమ పథకాలు, సాంకేతిక పరిజ్ఞానని అందు బాటులోకి తీసుకువచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఐదు రాష్టాలకు ఉపయోగపడే రామగుండము ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్దరణకు 6500 కోట్ల వ్యయంతో పునరుద్దరించి జాతికి అంకితం చేసిన ఘనత నరేంద్రమోదీ అని చెప్పారు అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు భరోసాగా పసల్ భీమా పథకం (ఎకరానికి 20 వేల నష్టపరిహారం )తెచ్చింది కేంద్రప్రభుత్వం నరేంద్రమోదీ అని చెప్పారు. కిసాన్ సమ్మన్ నీది ద్వారా రూ .6 వేల రూపా యలు రైతులకు అందించడం జరుగు తుందన్నారు.ఎరువుల పైన సబ్సిడీ యూరియా అసలు ధర రూ.2503 మనం చెల్లిస్తుంది 266 మిగతా రూ 2236 రూపాయలు కేంద్రప్రభుత్వం నరేంద్రమోదీ చెల్లిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలందరు కాంగ్రెస్ పాలన పట్ల విసుగు చెందిందన్నా రు.కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఈ రాష్టంలో ఆత్మహత్యలు తప్ప ఇంకా ఏమి మిగలవు అని అన్నారు. ఇప్పటికే కర్ణాటకలో 1200 రైతులు ఆత్మహాత్యాలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన, ఆత్మహాత్యాల పాలన, దోపిడీ పాలన అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగిపోయారని కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమ్మి క్కులు చేసిన వచ్చే స్థానిక ,కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని భూ అక్ర మార్కుల చేతిలో మోసపోయిన వారికి న్యాయం చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూరనారాయణ డిమాండ్ చేశారు. నాగారం బొందెం చెరువు కబ్జాల వెనుక బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి సామాన్య ప్రజలను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకో వాలన్నారు. మోసపోయిన ప్రజలకు న్యాయం చేయాలనీ కలెక్టర్ కనితి పత్రం అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు