మన సమాజం ఇంత గిడసబారిందా..

మన సమాజం ఇంత గిడసబారిందా?

*ఓ ముప్ఫై నలభై యేళ్ళ క్రితం..*

తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న 

*ఎన్ కౌంటర్* జరిగినా, అందులో *ఒక్కరు* చనిపోయినా, 

పత్రికల్లో *ప్రముఖ వార్త* గా ఉండేది 

ప్రజల్లో *పెద్ద చర్చ*:గా ఉండేది 

పార్టీలు, ప్రజాసంఘాల నుండి *నిరసనలు* బలంగానే వినిపించేవి

*కానీ…*

మొన్న ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ లో 30మందికి పైగా మావోయిస్టులు చనిపోయారట 

కొద్ది నెలల ముందు కూడా ఇదే అడవిలో జరిగిన ఎన్ కౌంటర్లోనూ

చాలా పెద్ద సంఖ్యలోనే మావోయిస్టులు చనిపోయారట

ఈ ఎన్ కౌంటర్లలో అమాయక గిరిజనులు, నిరాయుధులు ఉన్నారని మావోయిస్టులు ఆరోపిస్తుంటే, కీలకమైన పెద్ద పెద్ద నాయకులను

మట్టుపెట్టామని ప్రభుత్వం చాటుకుంటోంది

అమాయకులైనా, పెద్ద పెద్ద మావోయిస్టులైనా చనిపోతోంది *మనుషులు* అనేది బాధాకరమైన నిజం!

 

*ఇంతమంది* మనుషులు చనిపోతూ వుంటే 

గతంలో గొప్పగా *నిరసించిన* సమాజం ఇప్పుడెందుకు ఇంత *మౌన నిద్ర* లోకి జారిపోయింది?

 *కనీసపాటి స్పందన* కూడా ఎందుకు కరవయ్యింది??

మావోయిస్టు నాయకత్వం సైతం ఆలోచించు కోవలసిన *సమస్య* ఇది!

 

*ఆయుధాలు ధరించిన కొద్దిమంది* *కార్యకర్తలతో అతికొద్ది అటవీ* *ప్రాంతంలో సొంత రాజ్యం నడుపుతూ*  

*💯 కోట్లకు పైగా నివసించే మిగతా జనసమూహ మైదాన ప్రాంతాలను విస్మరించిన ఫలితంగానే ఇటువంటి స్పందనా రాహిత్యం ఏర్పడిందని మావోయిస్టు నాయకత్వం గుర్తించాలి!*

 

*పిడికెడు మందిగా ఉన్న మావోయిస్టులను విలన్లుగా చూపించి యుద్ధం ప్రకటించి ఇంతమంది మనుషులను నిర్దాక్షిణ్యంగా ఇంత దయా రహితంగా చంపి వేయడం ప్రజాస్వామ్యం కోసమేనా? ప్రజల కోసమేనా??*

 

*అదే నిజమైతే..*

*1 మావోయిస్టులు లేవనెత్తిన*

*ఏ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందో ముందుగా ప్రజలకు చెప్పాలి*

 

*2 మేము ఈ సమస్యలు పరిష్కరించాం మీరు ఆయుధాలు విడిచి పెట్టమని ప్రభుత్వం మావోయిస్టులకు పిలుపునివ్వాలి*

 

ప్రభుత్వం ఈ రెండు పనులూ చేసిందా అనేది ప్రభుత్వంలో ఉన్నవారు *మానవీయం* గా సమీక్ష 

చేసు కోవాలి?

 

ఏ ప్రభుత్వమైనా ముందుగా *శాంతియుత* పరిష్కారం గురించి ఆలోచించాలి 

*ద్వౌపాక్షిక చర్చలకు* ఆహ్వానించాలి 

అది విఫల మైనప్పుడు మాత్రమే ప్రభుత్వం తన *సాయుధ* చర్యలకు దిగాలి *ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు* విధే ఇది.

మన ప్రభుత్వం వారు అలా ఎందుకు వ్యవహరించడం లేదో ఆలోచించు కోవాలి?

 

*శత్రు దేశాలతో* సైతం మనం ఇలాగే వ్యవహరిస్తున్నాం *ద్వైపాక్షిక* చర్చలు చేస్తున్నాం, *మధ్యవర్తి* పరిష్కారాలు ఆలోచిస్తున్నాం, *ఐక్యరాజ్యసమితి* అంతర్జాతీయ సంస్థలకు *నివేదిస్తున్నాం* అటు తరవాతే *యుద్ధ* చర్యలకు *ఉపక్రమిస్తున్నాం* శత్రు దేశాలతో ఇన్ని జాగ్రత్తలు, 

ఇంత ప్రజాస్వామికంగా ఆలోచించే ప్రభుత్వం..

తనదేశ ప్రజలు, తన పౌరులే అయినటువంటి *మావోయిస్టుల* విషయంలో ఇంత కౄరంగా ఎందుకు వ్యవహరించాలి.. ఇది చాలా అన్యాయంగా లేదా?

 

*ప్రభుత్వం* వారు ఇప్పటికైనా ఆలోచించాలి మావోయిస్టులను *శత్రువులు* గా చూడడం మానుకోవాలి

మావోయిస్టులు *దారి తప్పారని* ప్రభుత్వం వారు భావించినా సరే, రాజకీయ ప్రత్యర్ధులుగానే వారిని పరిగణించాలి, చర్చలకు పిలవాలి 

అలాగే అన్ని పార్టీల వారితో *అఖిలపక్షం* ఏర్పాటు చేసి శాంతియుత పరిష్కారాలు కనుగొని 

సదరు నిర్ణయాలను మావోయిస్టుల ముందుంచాలి *జనజీవనం* లో కలవమని అడగాలి *ఎన్ కౌంటర్ల* హింస దాకా పోకుండా దేశంలో *శాంతిని స్థాపించాలి*

ఈ *చొరవ* కేంద్ర ప్రభుత్వం వారే తీసుకోవాలని *నా అభ్యర్థన!*

 

*పౌర, ప్రజాస్వామిక సమాజం నుండి కూడా ఒత్తిడి రావాలని, ఆశిస్తున్నాను!*

 

*మనుషుల అకాల, హింసాత్మక మరణాలు ఆగాలని, శాంతి నెల కొనాలని ఆకాంక్షిస్తున్నాను!*

 

*తమ ప్రాణ త్యాగాలు అవసరం మేరకే జరుగుతున్నాయో, లేదో* *ఇది మాత్రమే పరిష్కామా?* అన్న విషయం మరోక్కసారి.. మరొక్కసారి.. మరొక్కసారి *పునః పరిశీలన* చేసుకోవాలని మావోయిస్టులకు నా విజ్ఞప్తిమావోయిస్టు మృతులకు నా సానుభూతి, సంతాపాలు తెలియచేస్తూ.పై విన్నపాల ను మావోయిస్టులు మరియు భారత ప్రభుత్వం వారి దృష్టికి తెస్తున్నాన..

Join WhatsApp

Join Now