కాంగ్రెస్ – కేసీఆర్‌కు పొంగులేటి మధ్యవర్తిత్వం నిజం కాదా

కాంగ్రెస్ – కేసీఆర్‌కు పొంగులేటి మధ్యవర్తిత్వం నిజం కాదా..

 

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతుందే కాంగ్రెస్ పార్టీ అంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీ వేణు గోపాల్ దగ్గర కేసీఆర్ కుటుంబం చేసుకున్న ఒప్పందంపై మాట్లాడాలన్నారు. అటు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్యవర్తిత్వం చేస్తూ కాపాడుతుంది నిజం కాదా.. కాంగ్రెస్ ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌పైన ఈడీ విచారణ, సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు. సీబీఐ విచారణ నేరుగా రాష్ట్రంలో చేయడానికి వీలు లేదని జీవో తెచ్చింది బీఆర్‌ఎస్ కాదా అని ప్రశ్నించారు.

 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్ నా మీద చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ప్రజా సమస్యలపై బీజేపీ ఎన్నో పోరాటాలు చేసింది. శాసనసభలో నేను మాట్లాడింది ప్రజలు విన్నారు. రాష్ట్రానికి సీబీఐ వచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. ధరణి, కాళేశ్వరం, విద్యుత్‌లతో అనేక అంశాల్లో బీఆర్‌స్ చేసిన అవినీతి బయటకు రాబోతుంది. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశాన్ని పరిశీలిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే 24 గంటల్లో సీబీఐ దించుతాం. డ్రామా రావు డ్రామాలు ఆపితే బాగుంటుంది’’ అంటూ మహేశ్వర్‌రెడ్డి దుయ్యబట్టారు.

 

*వారికి ఇదే నా ఛాలెంజ్…*

 

ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు అప్పగిస్తూ ప్రజా ధనం వృధా చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారన్నారు. ఇది ప్రాఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవునా.. కదా అని ప్రశ్నించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో టెండర్లు అన్నీ రాఘవ కంపెనీకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చారని.. ఇంకా కొన్ని మేఘ కంపెనీకి ఇచ్చారని తెలిపారు. ఈ రెండు కంపెనీలకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు కాంట్రాక్ట్ వర్క్‌లు ఇచ్చారన్నారు. ఇలా విచ్చల విడిగా కాంట్రాక్టులు ఇచ్చుకుంటూపోతున్న పొంగులేటిని ప్రభుత్వం తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన గంట పాటు మంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు.

 

పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, కేటీఆర్‌లకు నేను ఛాలెంజ్ చేస్తున్న. స్టేట్‌లో కాంట్రాక్టులన్నీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పంచుకోవడం వాస్తవం కాదా. ఇది నేను నిరూపిస్తే మీరు దేనికి సిద్ధం. లేదంటే నేను అయినా నా పదవికి రాజీనామా చేస్తా. హైడ్రా సంగతి, ఇతర కమీషన్‌ల సంగతి నేను తెలుస్తా. లేదంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. అనేక అంశాలపై నేరుగా ముఖ్యమంత్రికి బహిరంగ లేఖలు రాశాను. కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాను’’ అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now