పథకాలకు పాతర.ముఖ్యమంత్రి ఫోటోలతో జాతరా ?
ఇదేనా ముఖ్యమంత్రి దసరా కానుక
ప్రభుత్వ ఉద్యోగుల డీఎలకు ఇంత వరకు దిక్కు లేదు.పీఆర్సీ గురించిన ఊసు లేదు.ఎకరాకు రూ.7500 రైతు భరోసా మాటెత్తడం లేదు.అరకొర రుణమాఫీతో చేతులు దులుపుకున్నారు .. అన్నదాతలను బ్యాంకులు కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు.రూ.4000కు ఆసరా పెన్షన్ పెంపు ఎప్పటి నుండో చెప్పడం లేదు.మహిళలకు గృహజ్యోతి కింది రూ.2500 హామీ అటకెక్కించారు.కళ్యాణ లక్ష్మికి తులం బంగారం లేదు.ఆడబిడ్డలకు అమ్మవడి కింది రూ.12 వేలు, రూ.13 వేలు, కేసీఆర్ కిట్ మాయం చేశారు. గర్బవతులకు న్యూట్రిషన్ కిట్ కట్ చేశారు. బతుకమ్మ చీరలు నిలిపేసి నేతన్నల బతుకుల్లో మన్నుపోశారు.హైడ్రా పేరుతో పేదల కంటికి కునుకు లేకుండా .. కూల్చివేతలతో వారి బతుకుల్లో నిప్పులు పోశారు.రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు పేదల బతులకును చిద్రం చేశారు.రైతన్నలను ఆగం చేసి .. వ్యవసాయ రంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు కానీ ప్రతీ కార్యాలయం లో సీఎం రేవంత్ ఫోటో అక్టోబర్ 7 లోపు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు.కానీ ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా, 6 గ్యారంటీల అమలుకు మాత్రం ఆదేశాలు లేవు .ఆరు గ్యారంటీల అమలును పట్టించుకోని ప్రభుత్వం ఆగమేఘాల మీద సీఎం ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలన్న ఆదేశాలపై ఒక ప్రకటనలో వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..