*తెలంగాణ యూనివర్సిటీకి ఈశ్వారీభాయి నామవిస్తరణ చేయాలి*
ప్రశ్న ఆయుధం మార్చి 25:
తెలంగాణ యూనివర్సిటీకి ఈశ్వారీబాయి పేరు పెట్టి నామవిస్తరణ చేయాలని అంబేడ్కర్ యువజన సంఘం (ఏవైఎస్) డిమాండ్ చేశారు. మంగళవారం ఏవైఎస్ ఆధ్వర్యంలో జిల్లా నిజమాబాద్ ఆర్మూర్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మార్గదర్శకులుగా తెలంగాణ ఉద్యమ నేత, అంబేడ్కరైట్ అడ్వకేట్ గంట సదానందం మాట్లాడుతూ ఈశ్వారీభాయి నిజమైన తెలంగాణవాది. తొలితరం తెలంగాణ పోరాట యోధురాలు. ఆమె అనేక ఉద్యమాల తోపాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరు చేసిన వీరనారి. ఆ రోజుల్లో తెలంగాణ ప్రజా సమితి (టిపిఎస్) ఉద్యమ సంఘంలో క్రియశీలక పాత్ర పోషించారు. ఆ టిపిఎస్ కు మదన్ మోహన్ కన్వీనర్ గా, మర్రి చెన్నారెడ్డితో సహా 3వ వరుసలో అత్యంత ప్రముఖ పాత్ర నిర్వహించారు. అదేవిధంగా విద్యా, వైద్యం, సాగునీరు, పరిశ్రమలు, విద్యాలయాలు మొదలైన శాఖల్లో తమ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను ఆమె అసెంబ్లీలో గొంతేత్తారు. అట్టి మహిళా యోధురాలి పేరును యూనివర్సిటీకి నామకరణ చేయడం వందశాతం సబబే అన్నారు. రాష్ట్ర సీఎం త్వరలో నిర్ణయం తీసుకోవాలని, లేనిచో తెలంగాణవాదులు, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఉద్యమించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఏవైఎస్ జిల్లా అధ్యక్షులు ఇత్వార్పేట్ లింగన్న మాట్లాడుతూ జనగం జిల్లాకు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలి, ఆశా వర్కర్లపై నిర్బంధం సడలించాలి, వారి డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని రాష్ట్ర సర్కారుకు కోరారు. ఈ ప్రెస్ మీట్లో గోసంగి సంఘం నాయకులు లింగస్వామి, ఆదివాసీ నాయకపోడ్ సంఘం నేత నారి గంగాధర్, కొండ్రు నరేష్, పస్తం గంగాధర్, అడ్వకేట్ మామిడి రాజేశ్వర్, జర్నలిస్ట్ పింజ సుదర్శన్, ముంబైనేత మూలనివాసి మాలజీ పాల్గొన్నారు.