గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన నారం బాలయ్య ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఆర్థిక ఇబ్బందుల వలన కార్పొరేట్ హాస్పిటలకు వెళ్ళలేని పరిస్థితిలో వైద్యం కోసం ఎదురుచూస్తున్న విషయం మల్లారెడ్డిపేట గ్రామ శాఖ అధ్యక్షులు సతీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శెట్టి రవి ద్వారా తెలుసుకున్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ వెంటనే బాలయ్య గారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఎల్ఓసికి కావాల్సిన పత్రాలను తీసుకొని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించి వెంటనే బాలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా రెండు లక్షల 50 వేల రూపాయలన మంజూరు చేసి బాధిత కుటుంబానికి ఎల్ ఓ సి అందజేశారు .ఈ సందర్భంగా బాలయ్య కుటుంబం సభ్యులు, కేకే మహేందర్ రెడ్డి గారికి ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కోమిటీ శెట్టి తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మూల రామచంద్ర రెడ్డి, శెట్టి రవి, సతీష్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, తోపాటు తదితరులు పాల్గొన్నారు.