కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్ లో సమస్యలను పరిష్కరించాలి
సామాజిక కార్యకర్త ప్రముఖ లాయర్ కర్నె రవి
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రాయల పోలయ్య జూలై 22
మణుగూరు మండలం లోని గ్రామ పంచాయతీ పరిదిలలో నివసించే ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి సామాజిక కార్యకర్త, ప్రముఖ లయర్ కర్నె రవి పల్లె యాత్ర మొదలుపెట్టి వివిధ పంచాయతీల్లో ప్రజల సమస్యలను తెలుసుకొని సోమవారం కలెక్టరేట్ లో జరిగే గ్రీవెన్స్ లో పలు సమస్యలను పరిష్కరించాల్సిందిగా దరఖాస్తు చేశాను అని తెలిపారు.. ముత్యాలమ్మ నగర్ పంచాయతీ పరిధిలో సంతోష్ నగర్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాలు చెరువులను తలపిస్తున్నాయి అని, చిన్న పిల్లలు అంగన్వాడి కేంద్రానికి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని వెంటనే అంగన్వాడి కేంద్రానికి తగిన రహదారి కల్పించాలని సామాజిక కార్యకర్త కర్నె రవి పేర్కొన్నారు. అదే విధంగా గిరిజనపొడు గ్రామాలు ఐనా తో గూడెం గ్రామపంచాయతీ పరిదిలో గిరిజన ప్రజలు పొడు భూములను సాగు చేసుకొని జీవిస్తున్నారు.. అటువంటి గిరిజన రైతులకు రైతుబంధు పథకం కింద మంజూరైన పోడు భూమి పత్రాలు ఇవ్వడం గురించి గ్రీవెన్స్ లో దరఖాస్తు చేయడం జరిగిందని సామాజిక కార్యకర్త కర్నె రవి తెలిపారు. మల్లె పల్లి సింగరేణి భూ నిర్వాసితులకు కరెంటు లైన్ లేవపోవడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అని వెంటనే అక్కడి ప్రజలకు అవసరాలకు తగ్గట్లు కరెంటు లైన్స్ ఏర్పాటు చేయాలని, మణుగూరు టీజీ టీ డబ్ల్యూ యు ఆర్ జె సి గర్ల్స్ మణుగూరు పాఠశాలకు వెళ్లడానికి సరైనటువంటి రహదారి మార్గం లేకపోవడంతో , వీధిలైట్లు లేకపోవడంతోరాత్రి సమయాలలో పాములు స్కూల్ లోకి ప్రవేస్తున్నాయి అని విద్యార్థులు బయపడుతున్నారు అని సామాజిక కార్యక్త కర్నె రవి ఈ సమస్యలను వెంటనే వెంటనే పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు చేశామన్నారు ఈకార్యక్రమంలో మట్టపల్లి సాగర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..