కేంద్రమంత్రి అమిత్ షా అంబేద్కర్ ని చులకనగా మాట్లాడడం హేయమైన చర్య

కేంద్రమంత్రి అమిత్ షా అంబేద్కర్ ని చులకనగా మాట్లాడడం హేయమైన చర్య

అమిత్ షా దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలి

కెవిపిఎస్ సిద్దిపేట జిల్లా కమిటీ డిమాండ్

సిద్దిపేట డిసెంబర్ 19 ప్రశ్న ఆయుధం :

బిజెపి కేంద్రమంత్రి అమిత్ షా నిన్న పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని చులకనగా మాట్లాడుతూ అవమానించిన దానికి నిరసనగా ఈరోజు చేర్యాల మండల కేంద్రంలో మరియు గుర్జగుంట గ్రామంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దర్శనం రమేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ని అవమానిస్తే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టే అని, భారత రాజ్యాంగాన్ని అవమానిస్తే ఈ దేశాన్ని దేశ ప్రజలను అవమానించినట్టే అని అన్నారు, అమిత్ షా వ్యాఖ్యలు దేశ ప్రజలను, భారత రాజ్యాంగమును అగౌరవ పరిచేలా ఉన్నాయని అన్నారు. ఈరోజు అమిత్ షా గారు పార్లమెంటులో ఉండడానికి అలాగే తనకు నచ్చిన మతం గురించి మాట్లాడడానికి స్వేచ్ఛనిచ్చింది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే ఆర్టికల్ 25 అని గుర్తు చేశారు. దేశంలో పలు సందర్భాల్లో బిజెపి నాయకులు రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రత్యక్షంగా ప్రకటించడం దేశ విద్రోహ చర్యగా పరిగణించాలని అన్నారు రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగా బిజెపి ప్రభుత్వం ఈ రకమైనటు వంటి వాక్యాలు చేస్తుందని అన్నారు ఒక గొప్ప సంఘ సంస్కర్త రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని ఒక ప్రజాస్వామ్య బద్ధమైన పదవిలో ఉండి కూడా విమర్శించడం సరైనది కాదని దీనికి వెంటనే అమిత్ షా తన పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ముస్థాల ప్రభాకర్, నాయకులు బోయిని మల్లేశం, మల్కనీ ఎల్లయ్య, ఎర్ర బోసు అశోక్, దర్శనం ప్రశాంత్, దర్శనం రాజేష్, సుంచు కరుణాకర్, దర్శనం మున్న తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now