*పెళ్లిళ్లకు పోవాలంటేనే భయమేస్తుంది..!*
*ముహుర్త సమయాన్ని దాటి రెండు మూడు గంటలు ఆలస్యంగా పెళ్లిళ్లు చేస్తున్నారు…!*
*వచ్చిన అతిథులు సహనం కోల్పోతున్నారు…!*
*వచ్చిన అతిథులకు వేరే పనులు ఉండవా? అక్షింతలు వెయ్యకముందే భోజనం చేసి సగం మంది వెళ్లి పోతున్నారు…!*
ఆ ఫోటో షూట్ ఏంది? ఆ ఫోటో షూట్ కే గంట రెండు గంటలు టైం వేస్ట్ చేస్తున్నారు ఫోటోగ్రాఫర్లు… ఆ గ్రాండ్ వెల్కమ్ ముందు అందరు డ్యాన్స్ చేస్తు ఒక గంట సమయం వృధా చేసుడు ఏంది?… ఆ గ్రాండ్ వెల్కం ముందు డ్రై ఐస్, పూలకుండీలు, పటాకులప కాల్చడంతో AC ఫంక్షన్ హాల్ లో దట్టంగా పోగ నిండి అతిథులకు ఇబ్బందిగా మారుతుంది…!
మీరు ఇవన్ని ఒక రోజు ముందుగా చేసుకొని అతిథులను మరో రోజు పిలవండి….!
అతిథులు సమయానికి వస్తారు అక్షింతలు వేసి నవదంపతులను ఆశీర్వదించి భోజనాలు చేసి వెళ్తారు..!
లేదా ముహుర్తం టైం కంటే ముందు ఒక మూడు నాలుగు గంటల ముందు కళ్యాణ వేదికకు చేరుకుని మీ హంగులు ఆర్భాటాలు పూర్తి చేసుకొని, ముహుర్తానికి లగ్గం చేయించి అతిథులచే అక్షింతలు వేయించి భోజనాలు చేయించండి…!