సంస్కృతిని కాపాడాల్సిన అందరి బాధ్యత..!!

కె.పి.హెచ్.బి గణనాథుని మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న శేరి సతీష్ రెడ్డి మరియు

సిఐ వెంకటేశ్వరరావు

ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 11: కూకట్పల్లి ప్రతినిధి 

సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత అందరి పైన ఉందని కె.పి.హెచ్.బి. పోలీస్ స్టేషన్ సీఐ వెంకటేశ్వరరావు అన్నారు. ఆసియాలో అతిపెద్ద కాలనీగా పేరు ఉంది నాకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని టెంపుల్ బస్ స్టాప్ లో కె.పి.హెచ్.బి. కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని మండపం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక సాంప్రదాయ బద్దంగా నృత్యాలు చేశారు. రంగురంగుల హరివిల్లును వెదజల్లే విధంగా ఏర్పాటు చేసిన లైట్ల మధ్యన చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని కట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కే.పి.హెచ్.బి. సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విజ్ఞానానికి నేపథ్యం వినాయకుడని వినాయక పర్వ దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన పలు వినాయకుల వద్ద భక్తి శ్రద్ధలతో పండగ జరుపుకోవాలని సూచించారు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఇతర మతాలను గౌరవించాల్సిన బాధ్యత పౌరుల పైన ఉందన్నారు. సమాజంలో అన్ని వర్గాల వారు బాగున్నప్పుడే సమాజం బాగుంటుందని అన్నారు. కె.పి.హెచ్.బి. కాలనీలో సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసి వినాయక నవరత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సంప్రదాయ నృత్యం చేసిన చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వరరావుకు కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎస్సై సుమన్, సీనియర్ నాయకులు సంజీవ్ రావు, మేకల మైకల్, దేవ సహాయం రవి, రాజేష్ గౌడ్,అరవింద్ రెడ్డి, నలినీకాంత్, లుంగీరాజు, రాజు ముదిరాజు, శేషగిరి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now