పేద ప్రజలకు ఇచ్చిన స్థలాలను ఆక్రమించుకోవడం దుర్మార్గం

*పేద ప్రజల జోలికొస్తే ఖబడ్దార్*

*పేదలకు ఇచ్చిన భూములు గుంజుకోవడం దుర్మార్గం*

*పేద ప్రజలకు అండగా బీజేపీ*

*జమ్మికుంట బిజెపి పట్టణ అధ్యక్షుడు మల్లేష్*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 1*

నిరుపేద ప్రజలకు నివేదిక స్థలాలను మంజూరు చేసి పట్టాలి ఇచ్చిన వాటిని తిరిగి లాక్కోవడం దుర్మార్గమని జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ అన్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆటోనగర్ ప్రాంతంలో 2007వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం దాదాపు 371 మంది నిరు పేద ప్రజలకు నివేదన స్థలాలకు పట్టాలు ఇవ్వడం జరిగిందని అందులో కొంతమంది ఇండ్లు నిర్మించుకోగా మరి కొంతమంది ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇండ్లు నిర్మించుకోలేకపోయారని ఇండ్లు నిర్మించుకోక ఖాళీగా ఉన్న భూములను స్థానిక మున్సిపల్ అధికారులు అక్రమంగా ఆక్రమించుకొని అందులో చెత్త వేయడం జరుగుతుందని సంబంధిత బాధితులు వాపోయారని బాధితులకు మద్దతుగా గురువారం రోజు బిజెపి పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ పెద్ద ఎత్తున బిజెపి శ్రేణులతో సంబంధిత ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు పట్టణ అధ్యక్షుడు జీడీ మల్లేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం మాట్లాడుతూ పేద ప్రజలకు ఇచ్చిన భూములలో అక్రమంగా మున్సిపల్ అధికారులు చెత్త వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మున్సిపల్ పరిధిలోని అనేక ప్రభుత్వ భూములను మున్సిపల్ పాలకవర్గంలోని కొంతమంది కౌన్సిలర్లు అక్రమంగా ఆక్రమించుకున్న పట్టించుకోని మున్సిపల్ అధికారులు పేదలకు ఇచ్చిన భూములలో ఇండ్లు నిర్మించుకోలేదనే నేపంతో వారి భూములను ఆక్రమించుకోవడం సరైన పద్ధతి కాదని బీజేపీ నాయకులు హితువు పలికారు వెంటనే మున్సిపల్ అధికారులు పేద ప్రజలకు ఇచ్చిన భూముల్లో వేసిన చెత్తను అక్కడి నుండి తీసివేయాలని డిమాండ్ చేశారు లేనట్లయితే పేద ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కళ్ళు తెరిచి ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న మున్సిపల్ పాలకవర్గ సభ్యుల పైన చర్యలు తీసుకొని ఆ భూములను వెనక్కి తీసుకోవాలని కోరారు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని పేదలకు భూమిని ఇస్తామని చెబుతూ ఉంటే జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మాత్రం పేదలకు ఇచ్చిన భూములను గుంజుకోవడం ఎంతవరకు సమంజసం అని అధికారులను ప్రశ్నించారు పట్టణంలో ఉన్న నిరుపేదల భూములను ఆక్రమించుకోవాలని చూస్తే భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పల్లపు రవి కైలాష్ కోటి గణేష్ అప్పం మధు యాదవ్, మోతే స్వామి, ఇటికలు స్వరూప మేక సుధాకర్ రెడ్డి మోడెం రాజు బల్సుకురి రాజేష్ గిరివేని విజేందర్ కొండ్లె నాగేష్ మల్లాడి సమ్మిరెడ్డి శనిగరపు రవి ముకుందం సుధాకర్ కన్నెబోయిన బద్రి కుంభాల వెంకట్రాజ్యం ఆకుల కిషన్,నాగపురి విజయ్ వీణవంక శివ యాంసాని సమ్మయ్య, తాళ్లపల్లి తిరుపతి కనుమల లక్ష్మి, కొండ్ల సులోచన, జాల రంజిత్, భూ బాధితులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now