ఫతేనగర్ లో 150ఏళ్లుగా ముద్దపురం కుటుంబం ఘటాలు సమర్పించడం అదృష్టంగా ఉంది
ప్రముఖ సమాజ సేవకులు ముద్దపురం సహదేవ్ గౌడ్
మేడ్చల్ ప్రశ్న ఆయుధం జూలై 21
కూకట్పల్లి నియోజకవర్గం, పరిధిలోని ఫతేనగర్ లో వంద ఏళ్ల నాటి చరిత్ర గల దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన అమ్మవారికి 150ఏళ్లు గా పోచమ్మ తల్లికి మొదటి ఘటం సమర్పించడం చాలా అదృష్టంగా ఉందని ముద్దపురం సహదేవ్ గౌడ్ అన్నారు.ఈ సందర్భంగా ముద్దపురం సహదేవ్ మాట్లాడుతూ బోనాల పండుగ ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటమాదిరిగానే ఈసారి కూడా అమ్మవారికి ఘటం సమర్పించడం పూర్వజన్మఅదృష్టంగా భావిస్తున్నానని ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని యావత్ రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కంచి మహేందర్, కే.రమేష్,కే.అనిల్,కే.రాజు పటేల్,
కే.పాండు,వారాల స్వామి,
శివ,అభినవ్,వరుణ్ తదితరులు పాల్గొన్నారు.