కరివేపాకే కదా అని ఈజీగా తీసిపారేయొద్దు! – ఏడాదికి రూ.100 కోట్లపైనే వ్యాపారం
ఒక్కసారి నాటితే 30 ఏళ్ల దిగుబడి – పంట సాగుకు ఎకరానికి ఏడాదికి రూ.లక్ష ఖర్చు – ఇతర రాష్ట్రాలతోపాటు దుబాయ్‌కు ఎగుమతి
కర్రీకి రుచి రావాల్సింది అంటే కచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే. మనం మాత్రం దాన్ని ప్లేట్ నుంటి తొలగిస్తాం. ఆ కరివేపాకు సాగే ఇప్పుడు కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ఎన్నో పోషక విలువలు కలిగిన దీన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. వివరాలు ఏంటో తెలుసుకుందాం!కరివేపాకు రూ.5 లేదా రూ.10 పెడితే ఏ సంతలో, మార్కెట్లోనైనా ఓ చిన్న కట్ట లభిస్తుంది. అంతమాత్రాన దాన్ని తేలిగ్గా తీసి పారేయొద్దు. ఎందుకంటే కరివేపాకు ద్వారా రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. గుంటూరు జిల్లా పెదవడ్లపూడి కరివేపాకు సాగుకు ఎంతో పేరు గాంచింది. అక్కడి రైతులు దీనిని వాణిజ్య పంటల కూడా సాగు ప్రారంభించారు. క్రమంగా ఇతర ప్రాంతాల్లోనూ భూములు లీజుకు తీసుకుని, సాగుచేయడం మొదలుపెట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, పెద్దపప్పూరుల్లో భారీ విస్తీర్ణంలో కరివేపాకు సాగవుతోంద