*బిల్లులు ఇవ్వమని అడిగితే అరెస్టులు చేయడం సమంజసం కాదు – మాజీ సర్పంచులు*
నార్సింగి ఫిబ్రవరి 04
మెదక్ జిల్లా నార్సింగి మండలం లో పలు గ్రామాలకు మాజీ సర్పంచుల ను మంగళవారం రోజు ఉదయం చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారుని సర్పంచులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 14 నెలలు గడుస్తున్నా పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదని వాపోయారు. గ్రామాల అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి పనులు చేశామని,అభివృద్ధి పనులకు అప్పులు తెచ్చి మరీ పనులు పూర్తిచేశామని అన్నారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడం వల్ల తమ పై చాలా భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.చేసిన పనులు బిల్లులకు ఇవ్వమని అడిగితే అరెస్టులు చేయడం సమంజసం కాదని, ప్రశ్నించే గొంతు కలను కాంగ్రెస్ ప్రభుత్వం అనిచివేస్తుందని మండి పడ్డారు.ఇకనైనా ప్రభుత్వం స్పందించి సర్పంచుల పెండింగ్ బిల్లులను విడుదల చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.