Site icon PRASHNA AYUDHAM

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం బాధాకరం

IMG 20251224 WA0297

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం బాధాకరం

ఆర్మూర్ (ప్రశ్న ఆయుధం) ఆర్ సి డిసెంబర్ 24.

వి హెచ్.పి.ఎస్ (వికలాంగ హక్కుల పోరాట సమితి) ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీని విస్మరించి రెండు సంవత్సరాలు గడిచిందనీ ,చేయుత పింఛన్దారులను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తుందని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పబ్బం గడుపుతూ పింఛన్దారులందరినీ కూడా మోసం చేస్తున్నారని.. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చేయూత పింఛన్లను విడతలవారీగా పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం హేయమని అన్నారు. తెలంగాణలో పరిపాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం బాధాకరమని పింఛన్లు పెంచడం చేతకాకపోతే వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చేయుత పింఛన్లను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచకపోతే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Exit mobile version