దుమ్ముగూడెం మండలం బుధవారం నాడు పెద్ద నల్లబెల్లి గ్రామంలో మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు ముత్తవరపు జానకిరామ్ అధ్యక్షులను జరిగిన సమావేశంలో గోడ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ 2005 సంవత్సరం అటవీ హక్కుల చట్టం ప్రకారంగా అర్హులైన అందరికీ 2005లోపులోపు పోడు నరికిన వారికి పోడుభూమి సాగులో ఉన్న వారికి పట్టాలు ఇవ్వాల్సిందేనని సంబంధితఫారెస్ట్ అధికారులను కోరడమైనది
భూమిలేని పేద ఆదివాసీలను గుర్తించి వారికి పోడు భూమి కేటాయించాలి పెండింగ్లో ఉన్న పోడు భూములను తక్షణమే అర్హులైన ఆదివాసీలకు పంపిణీ చేసి పట్టాలివ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
గతంలో ప్లాంటేషన్లో ప్రైవేట్ వాచర్గా పనిచేసిన ఒక వ్యక్తి
ప్రభుత్వము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి (సిఏ ) కాంపోజిషన్ ఏరియా కింద భూమి కేటాయిస్తే ఆ భూమిలో గత మూడు సంవత్సరాల క్రితం నాటిన మొక్కలను అమాయక ఆదివాసీలను పోడు పేరుతో ఉసిగొలిపి నూతన అటవీహక్కుల చట్టాల ప్రకారం అమాయక ఆదివాసీలపై కేసులు నమోదయ్యే విధంగా ఆదివాసీలను పక్కన దారి పట్టిస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అతని బారి నుండి ఆదివాసులను కాపాడని కోరారు అడవులను కాపాడడంలో ఆదివాసులు ముఖ్య పాత్ర పోషించాల్సి బాధ్యత అందరిపై ఉందని అటవీ హక్కుల చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉందని ఈ సందర్భంగా కోరారు ఈ యొక్క సమావేశంలో మానవ హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి కిస్ట్ శ్రీనివాసరావు వాల్మీకి మాన్సింగ్ గోండు కిషోర్ కుమార్ బుదురాం గోకుల్ గోండు తదితరులు పాల్గొన్నారు.