కుల గణన సర్వే ప్రాథమిక పాఠశాల సిబ్బందికి మాత్రమే కేటాయించడం అన్యాయం..

Headlines (Telugu)
  1. కుల గణన సర్వే ప్రాథమిక పాఠశాల సిబ్బందికి కేటాయించడం అన్యాయమని పీ.ఏస్.హెచ్.ఏం.ఏ. నిరసన
  2. ప్రాథమిక విద్యను దెబ్బతీయే విధంగా కుల గణన సర్వే చేస్తోందని అభ్యంతరం
  3. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు కూడా కుల గణన సర్వేను కేటాయించాలని విజ్ఞప్తి

కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం నవంబర్ 02:

పీ.ఏస్.హెచ్.ఏం.ఏ.
కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఇందూరి రమేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పందిరి రాజేష్
మాట్లాడుతూ. కుల గణన సర్వే ప్రాథమిక పాఠశాల సిబ్బందికి మాత్రమే కేటాయించడం అన్యాయమని పీ.ఏస్.హెచ్.ఏం.ఏ.
కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఇందూరి రమేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పందిరి రాజేష్ లు శనివారం ఓ ప్రకటనలో ఖండించారు. ప్రాథమిక పాఠశాల బలోపేతం చేయవలసింది పోయి ఈ సర్వేను చేయించడం ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే విధంగా ఉందన్నారు.ప్రాథమిక పాఠశాల స్థాయిలోని విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేసి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ఈ కుల గణన సర్వేను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now