కేంద్రం తక్షణమే రూ.10వేల కోట్లు విడుదల చేయాలి-ప్రస్తుత ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలనీ కొత్తగూడెం శాసనసభ్యులు కూ నం నేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
దెబ్బతిన్న పంటలకు, రూ.30 వేలు, ఇళ్లకు రూ.50 వేలు చెల్లించాలి.
రైతులను,ప్రజలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూ నం నేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడారు.
జిల్లా నలుమూలల నుండి కదలివచ్చిన సిపిఐ శ్రేణులు
సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా , ఏఐటిసి జిల్లా నాయకులు నగేష్, రమేష్, రత్నకుమారి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.