హిందువుల సంఘటిత శక్తిగా చాటాలి

*హిందువుల సంఘటిత శక్తిగా చాటాలి*

*హిందూ వాహిని ప్రాంత బాధ్యులు రుద్రోజు శ్రీనివాస్, సూర్యప్రకాష్*

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో సెప్టెంబర్ 28*

హిందువులకు సంఘటిత శక్తి చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యంగా హిందూ సంఘాల ఐక్య వేదికలను ఏర్పాటు చేసుకొని అన్ని కుల సంఘాలను ధార్మిక సంఘాలను హిందూ సంఘాలను ఏకం చేసి జాతీయస్థాయిలో సనాతన బోర్డు ఏర్పాటుకు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని హిందు వాహిని ప్రాంత బాధ్యులు రుద్రోజు శ్రీనివాస్ ఆర్య సమాజ్ కరీంనగర్ శాఖ వ్యవస్థాపకులు సూర్య ప్రకాష్ అన్నారు. శనివారం రోజున కరీంనగర్ లోని మలయాళ సద్గురు గీతా మందిరం మఠంలో వివిధ కుల సంఘాలు ధార్మిక సంస్థల హిందూ ధర్మ సంఘాల ముఖ్య సమావేశం నిర్వహించారు ఇట్టి సమావేశంలో హిందువుల సమస్యల పై మాట్లాడి పలు విషయాలను తీర్మానించారు ప్రధానంగా తిరుపతి లడ్డు అపవిత్రత దేవాలయ భూములు అన్యాక్రాంతం కావడం లవ్ జిహాద్ కేసులు పెరిగిపోవడం హిందూ ధర్మ రక్షకులపై పోలీస్ ల అణచివేత కేసులు ఎక్కువ కావడం, హిందు సంఘాల బాధ్యుల పట్ల ప్రభుత్వం పోలీసులు అణిచివేత ధోరణిని అవలంబించడం దేవాలయాలను ప్రభుత్వ చెర నుండి విడిపించడానికి తీవ్రస్థాయిలో పోరాటం చేయాలనే విషయాలపై చర్చలు జరిపి తీర్మానాలు చేశారు అలాగే హిందూ సంఘాల ఐక్యవేదిక ఏర్పాటు చేసి అన్ని కులాల హిందూ బాధ్యులందరినీ భాగస్వామ్యం చేసి హిందూ కార్యకర్తలకు ఆర్థిక, న్యాయ సహాయం అందించే విషయంపై సమావేశంలోతీర్మానం చేశారు. ఇట్టి సమావేశంలో హిందూవాహిని జిల్లా సంయోజక్ బెజ్జెంకి శ్రీకాంత్ తో పాటు వివిధ హిందూ ధార్మిక సంస్థల బాధ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now