Site icon PRASHNA AYUDHAM

ఉసిరికపల్లిలో కుంభాకార దర్పణాన్ని ఏర్పాటు చేసిన అశోక్ సాదుల

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 10 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

కుంభాకార దర్పణాన్ని ఏర్పాటు చేసిన దృశ్యం

శివ్వంపేట మండలంలోని ఉసిరికపల్లి గ్రామ ప్రవేశం ప్రధాన మూల మలుపు వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున భారతీయ జనతా పార్టీ శివ్వంపేట మండల ప్రధాన కార్యదర్శి అశోక్ సాదుల కాన్వెక్స్ మిర్రర్ కుంభాకార అద్దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దర్పణం ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నారు. ఎందుకంటే ఎదురుగా వచ్చే వాహనాన్ని ముందే గుర్తుపట్టి జాగ్రత్త పడొచ్చని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భాస్కర్, రమేష్, వెంకటేష్, మల్లేష్, కృష్ణ, దుర్గాప్రసాద్, మారుతి, ప్రవీణ్, మహేష్ గౌడ్, శాస్త్రీ, మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version