Site icon PRASHNA AYUDHAM

తిరుపతిలో తొక్కిసలాటకు కారణమిదే?

Screenshot 2025 01 09 11 53 36 937 edit com.whatsapp

*తిరుపతిలో తొక్కిసలాటకు కారణమిదే?*

*ఆరుగురు మృతి*

తిరుమల తిరుపతి :

ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందారు.

టోకెన్ల కోసం బైరాగిపట్టెడ వద్ద ఉన్న పద్మావతి పార్కులో భక్తులను ఉంచారు.

టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థత గురికావడంతో ఆసుపత్రికి తరలించేందుకు క్యూలైన్ తెరిచారు.

టోకెన్లు జారీ చేసేందుకు క్యూలైన్ ఓపెన్ చేశారని భావించిన భక్తులు దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం.

Exit mobile version