*కిక్కు రావడం లేదు……..!!!!!*
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో లేకపోవడం వల్ల తమకు కిక్కు రావడం లేదని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ‘కేసీఆర్ సభకు వస్తే మజా ఉంటుంది. కరెంట్‌పై డిస్కషన్లో కేసీఆర్ ఉండి ఉంటే ఇంకా బాగా జరిగేది. ఆయన ఓడిపోయిన ఇంకా జాతిపిత అనుకుంటున్నాడు. కేసీఆర్ ఊహల్లో బతుకుతుండు. పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్లాలి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా వెళ్తారు. మహిళ అని క్లయిమ్ చేస్తున్నప్పుడు గౌరవంగా ఉండాలి కదా. పార్టీ మారి ఉండాల్సింది కాదు. హౌస్‌లో సస్పెన్షన్లు చేయకపోవడం మా ప్లాన్. ఎల్ఓపీగా కేసీఆర్ సభకు రాకపోవడంతో ఆ పార్టీ నేతల పరిస్థితి తల్లి లేని పిల్లలుగా అనిపిస్తుంది. మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ ఇద్దరిలో ఎవరికి ఎల్ఓపీ ఇచ్చిన బీఆర్ఎస్ ఆగం అవుతది. హరీష్‌రావు మంచి అనుభవం ఉన్న నేత కానీ ఆయనకు ఇవ్వరు. కేటీఆర్‌కు అవగాహన లేదు” అని రాజగోపాల్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు.