ఉపాధికి దగ్గర దారి ఐటిఐ విద్య

ఉపాధికి
Headlines :
  1. ఉపాధికి దగ్గర దారి ఐటిఐ విద్య – జిఎస్ఆర్ ఐటిఐ ఫ్రెషర్స్ డేలో ప్రిన్సిపాల్ సూచనలు
  2. జిఎస్ఆర్ ఐటిఐ ప్రిన్సిపాల్ ముష్కే వీర రాజు – ఐటిఐ విద్యతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు
  3. జమ్మికుంట జిఎస్ఆర్ ఐటిఐ ఫ్రెషర్స్ డే వేడుకలు – విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సూచన

*జిఎస్ఆర్ ఐటిఐ ప్రిన్సిపాల్ ముష్కే వీర రాజు*

*జమ్మికుంట అక్టోబర్ 30 ప్రశ్న ఆయుధం:-*

విద్యార్థులకు ఐటిఐ విద్యతో ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నాయని ఉపాధికి దగ్గర దారి ఐటిఐ విద్య అని జి ఎస్ ఆర్ ఐటిఐ ప్రిన్సిపాల్ ముష్కే వీర రాజు అన్నారు.స్థానిక జమ్మికుంట జి ఎస్ ఆర్ ప్రైవేట్ ఐటిఐ లో బుధవారం ఫ్రెషర్స్ డే ని అదే విధంగా కాన్వకేషన్ శర్మని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిఎస్సార్ ప్రైవేట్ ఐటిఐ ప్రిన్సిపల్ ముష్కే వీర రాజు మాట్లాడుతూ ఉపాధికి దగ్గర దారి ఐటిఐ అని విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా అనేక ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో వందలాది మంది విద్యార్థులు తన ఐటిఐ లో విద్య పూర్తి చేసుకొని ఈరోజు జేఎల్ఎంలుగా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పుటకు సంతోషిస్తున్నానని అన్నారు. ఇలా మీరందరూ కూడా మంచి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని మీరు ఏది కోరుకుంటే అది మన ఐటిఐ లో అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని విద్యార్థులను తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి వరుణ్ మోటార్స్ హెచ్ ఆర్ ప్రవీణ్ గాయత్రి డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ కుమారస్వామి అధ్యాపకులు సతీష్ రంజిత్ కుమార్ అంజిబాబు సాగర్ మధుకర్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now