ఏటిసిలుగా మారనున్న ఐటీఐలు…రుద్రంపూర్ ఐటిఐలో సంబరాలు కృతజ్ఞతలు తెలిపిన ఎన్.ఎస్.యు.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్ ( ) కొత్తగూడెం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రస్తుతమున్న శిక్షణ కార్యక్రమాలు సైతం కొత్తరూపు సంతరించుకోనున్నాయి. రెండుమూడు దశాబ్దాల నుండి కేవలం శిక్షణ కార్యక్రమాలనే ఐటీఐల్లో కొనసాగిస్తుండగా ఇకపై ఏటీసీల్లో సరికొత్త కోర్సులు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఎన్.ఎస్.యు.ఐ జిల్లా అధ్యక్షులు అజ్మీరా సురేష్ నాయక్ తెలిపారు. బడ్జెట్ ఒక్కో ఏటిసి కోసం 4.77 కోట్లను కేటాయించిన నేపథ్యంలో రుద్రంపూర్ ఐటిఐలో సంబరాలు నిర్వహించారు. బోధన సిబ్బందికి విద్యార్థులకు మిఠాయిలు తినిపించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం లకు ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఏటిసి లలో కొత్తగా ఆరు రకాల ట్రేడ్లను ఎంపిక చేసి వాటిని ఈ ఏడాది నుంచే ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోనుందని, జిల్లా కేంద్రంలో ఉన్న రుద్రంపూర్‌లోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటిఐ) ఇన్నాళ్లు నిధుల లేమితో సతమతం అయిందని, గత కొన్నేళ్లుగా ప్రాక్టికల్స్ చేసేందుకు అవసరమయ్యే రా మెటీరియల్‌కు నిధులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, ఇక్కడ ప్రతి యేటా 564మంది విద్యనభ్యసిస్తుండగా వారందరికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తీపి కబురు చెప్పారని అజ్మీర సురేష్ నాయక్ చెప్పారు…ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ నాయకులు మాలిక్ దీపక్, కాటి సందీప్, లావుడియా శశివర్ధన్, షేక్ మొహిన్, షేక్ సమీర్, తదితరులు పాల్గొన్నారు…