తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధనకై జేఏసీ దృఢ సంకల్పం
అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం, ఉద్యమకారులకు పెన్షన్ డిమాండ్
250 గజాల స్థలాలు, 10 లక్షల హెల్త్ కార్డు, ఉచిత బస్సు పాస్ సహా 11 డిమాండ్లు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల లోపు ప్రకటన చేయాలని విజ్ఞప్తి
నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి హెచ్చరిక
కరీంనగర్, సెప్టెంబర్ 3 (ప్రశ్న ఆయుధం)
తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దుర్గం మారుతి నేతకాని (న్యాయవాది) తన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి, రాష్ట్ర ప్రతినిధి బి. వెంకట మల్లయ్యతో పాటు కమిటీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యమకారుల హక్కులు ఇంకా సాధించాల్సి ఉన్నాయని స్పష్టం చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉద్యమకారులకు నెలకు 25 వేల పెన్షన్, 250 గజాల స్థలాలు, ఉచిత ఇన్సూరెన్స్, 10 లక్షల వరకు హెల్త్ కార్డు, బస్సు పాస్ వంటి 11 ముఖ్య డిమాండ్లతో జేఏసీ నిర్మాణం జరిగిందని వివరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఈ అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. “ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి… జై తెలంగాణ, జై జై తెలంగాణ” అంటూ పిలుపునిచ్చారు.