Site icon PRASHNA AYUDHAM

అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన జేఏసీ నాయకులు

IMG 20250326 201425

Oplus_131072

సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మండలం పార్యానగర్, నల్లవల్లి డంపుయార్డుకు వ్యతిరేకంగా గుమ్మడిదలలో 50వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం అందజేశారు. నిరాహార దీక్షలో మున్నూరు కాపు సంఘం నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. డంపుయార్డు ఏర్పాటు చేస్తే కలుషితంతో ఈ ప్రాంతం నాశనం అవుతుందని ప్రజలు మొరపెట్టుకున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, రాష్ట్ర రైతు సంఘం మాజీ అధ్యక్షుడు మంద బలరాం రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు అమ్మగారి సదానంద రెడ్డి, వర్తక సంఘం ఆకుల సత్యనారాయణ, రైతు సంఘం మాజీ అధ్యక్షుడు పోచుగారి మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, భాస్కరరెడ్డి, ఆకుల భిక్షపతి, సంఘం ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

Exit mobile version